వేల్పూర్, నవంబర్ 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలం జాన్కంపేట్ కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో బాలలకు హక్కులపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా ఐ.సి.డి.ఎస్. అధికారి చైతన్య, సిడిపిఓ సుధారాణి, అధికారి వేల్పూర్ సూపర్‌వైజర్ నీరజ ఈ సందర్భంగా మాట్లాడారు.
విద్యార్థులకు బాలల హక్కులపై పూర్తి స్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. బాల్యవివాహాలు, లింగ నిర్ధారణ చట్టం, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ తదితర వాటిపై వివరించారు. విద్యార్థులు మంచి చదువులు చదివి తమ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని అలాగే చదువుకున్న పాఠశాలకు పేరు తీసుకురావాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయు బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.