కామారెడ్డి, నవంబర్ 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధాన్యం కొనుగోలు కేంద్రానికి రైతులు వచ్చి కుప్పలు పోసిన ధాన్యం నుంచి తేమ శాతాన్ని వ్యవసాయ విస్తీర్ణ అధికారులు నిర్ధారణ చేసిన తర్వాత ధాన్యాన్ని కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం సహకార సంఘాల అధికారులకు, తహసిల్దార్, ఐకెపి అధికారులతో ధాన్యం కొనుగోలుపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులకు సకాలంలో అనుమతి పత్రాలు ఇచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరారు. కొనుగోలు కేంద్రానికి రైతులు ధాన్యం తీసుకురాగానే రైతుల పేర్లు వరుసక్రమంలో రికార్డులో ఏఈవోలు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. లారీకి సరిపడా ధాన్యం కాగానే ట్రాన్స్‌పోర్ట్ యజమానితో మాట్లాడి ధాన్యాన్ని రైస్ మిల్‌కు పంపించాలని చెప్పారు.
కొనుగోలు కేంద్రాల వద్ద సరిపడా హమలీలను ఏర్పాటు చేసుకోవాలని కోరారు. రైస్ మిల్లర్లు లారీలను సకాలంలో అన్‌లోడిరగ్ చేసుకోవాలని సూచించారు. కేంద్రాల వారి కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ వెంకట మాధవరావు, సివిల్ సప్లై డిఎం జితేంద్ర ప్రసాద్, ఆర్డీవో శీను, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గౌరీ శంకర్, అధికారులు పాల్గొన్నారు.