కామారెడ్డి, నవంబర్ 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలో ఈవీఎం గోదాం నిర్మాణం పనులను శుక్రవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని గుత్తేదారును ఆదేశించారు.
నాణ్యతగా పనులు చేపట్టాలని పేర్కొన్నారు. కలెక్టరేట్ సమీపంలో ఉన్న ఈవీఎం గోదాంను సందర్శించి ఈవీఎం మిషన్లలను పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.