కామారెడ్డి, నవంబర్ 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాచారెడ్డి మండలం భవాని పేటలో దాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ శుక్రవారం సందర్శించారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో వరి కుప్పలు ఎన్ని నిల్వ ఉన్నాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. 180 ధాన్యం కుప్పలు ఉన్నాయని, 120 కుప్పల ధాన్యం తేమ శాతం నిర్ధారణ చేసినట్లు చెప్పారు.
కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యం కుప్పలు పోసిన రైతుల వివరాలను రికార్డులలో నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రతిరోజు ధాన్యం కుప్పలు వద్దకు వెళ్లి వ్యవసాయ విస్తరణ అధికారులు తేమ శాతాన్ని నిర్ధారణ చేయాలని సూచించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఉగ్రవాయి లోని గజానన, భవానిపేటలోని శ్రీలక్ష్మి రైస్ మిల్‌లను పరిశీలించారు. తేమ శాతం తీసే విధానాన్ని చూశారు.
హమాలీల సంఖ్య పెంచి అన్‌లోడిరగ్ తక్షణమే చేసే విధంగా చర్యలు తీసుకోవాలని రైస్ మిల్లర్‌లను ఆదేశించారు. కలెక్టర్ వెంట సివిల్ సప్లై డిఎం జితేంద్ర ప్రసాద్, డిఎల్‌సివో రాజశేఖర్, అధికారులు పాల్గొన్నారు.