డిచ్‌పల్లి, నవంబర్ 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నాణ్యమైన పరిశోధనలు దేశాభివృద్ధికి గీటురాళ్లని తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య. డి. రవీందర్ గుప్త పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన పరిశోధన పత్రాలు ఆధునిక అభివృద్ధికి సూచికలన్నారు. శుక్రవారం ఆర్థికశాస్త్ర విభాగంలో ఈ నామ్ యొక్క సమస్యలు పరిష్కారాలు అనే అంశంఫై డా.ఏ .పున్నయ్య పర్యవేక్షణలో టీ.మల్లేశం పరిశోధన సిద్ధాంత గ్రంథం సమర్పించినందుకు తెలంగాణ విశ్వవిద్యాలయం డాక్టరేటును ప్రకటించింది.
ఫైనల్ వైవా కు ఎక్సటర్నల్ ఎక్సమినర్‌గా బనారస్ హిందూ యూనివర్సిటీ, వారణాసి సీనియర్ ప్రొఫెసర్ ఆచార్య. జే. బాలకోమరయ్య హాజరై ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ (ఈనామ్ )ప్రాధాన్యత అంతర్జాతీయంగా ఉన్నదని దాని పట్ల ఈ పరిశోధన మరింత ముందుకు పోతుందని పేర్కొన్నారు. ఈ విషయం పట్ల లోతైన ప్రశ్నలు అడిగి మల్లేశంను ప్రశంసించారు. పరిశోధనలో వాడిన గణాంకాలపట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
డీన్ ప్రొఫెసర్ కె. శివశంకర్ ఈనామ్ వ్యవస్థను ప్రభుత్వాలు మరింత ముందుకు తీసుకుపోవాలని చూచించారు. ఈ వైవా విభాగాధిపతి డా. సంపత్ అధ్యక్షతన జరిగింది. కార్యక్రమాన్ని ఛైర్మెన్ బోర్డు అఫ్ స్టడీస్ డా. పాత నాగరాజు సమన్వయం చేశారు. డా. రవీందర్ రెడ్డి, డా. స్వప్న, డా. శ్రీనివాస్, డా. దత్తహరి, పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు.