నిజామాబాద్, నవంబర్ 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాలల దినోత్సవం సందర్భంగా మహిళా శిశు సంక్షేమ శాఖ, బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక న్యూ అంబేద్కర్ భవన్‌లో బాలల హక్కుల వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ చిత్ర మిశ్రా ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. నేటి బాలలు రేపటి భావి భారత పౌరులు, బాగా చదివి ఉన్నత స్థానానికి ఎదగాలని కోరారు. బాల్య వివాహాలు జరగకుండా బాలలపై లైంగిక వేధింపులు జరగకుండా, వారి హక్కులకు భంగం కలిగించకుండా చూడాల్సిన బాధ్యత మనపై ఉందని తెలిపారు.
ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమ రాజ్ పిల్లల్ని ఉద్దేశించి మాట్లాడారు. పౌష్టికాహారం తినాలని పౌష్టికాహారం లోపం వల్ల అనేక అనారోగ్య లక్షణాలు కనిపిస్తాయని, ఆరోగ్యమే మహా భాగ్యమని అన్నారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి రaాన్సీ లక్ష్మి, డిసిడివో వనిత, మహిళా పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో, డిసిపిఓ చైతన్య కుమార్, బాల రక్షా భవన్ కోఆర్డినేటర్ స్వర్ణలత, జిల్లాలోని సిడిపివోలు, ఐసీపీఎస్, చైల్డ్ హెల్ప్ లైన్ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.