బాల్కొండ, నవంబర్ 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అభ్యసన సామర్థ్యాలపై దేశవ్యాప్త సర్వే నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం అందులో భాగంగా శుక్రవారం బాల్కొండ మండలంలో సర్వే చేపట్టిందని మండల విద్యాధికారి బట్టు రాజేశ్వర్ పేర్కొన్నారు. ఉమ్మడి బాల్కొండ మండలంలోని పోచంపాడు రెసిడెన్షియల్ బాలుర గురుకుల, సాంఘిక సంక్షేమ పాఠశాల బాలికలు పోచంపాడు, ప్రాథమిక పాఠశాల పోచంపాడు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మెండోరా, స్టీస్ సెయింట్ ఎలిజబెత్ ఎయిడెడ్ పాఠశాల కిసాన్ నగర్, పరీక్ష సెంటర్లలలో ప్రశాంతంగా ముగిసాయి.
తెలంగాణ నుంచి 4,936, ఉమ్మడి బాల్కొండ మండలం నుండి 150 మంది విద్యార్థులు హజరయ్యారు. జిల్లాలో 189 పాఠశాలలు ఎంపిక చేయడం జరిగింది. పై పాఠశాలల నుంచి విద్యార్థులు సర్వేలో పాల్గొననున్నారు. దేశవ్యాప్తంగా పాఠశాలల విద్యార్థుల్లో అభ్యసన సామర్ధ్యాలను అంచనా వేసేందుకు శుక్రవారం జాతీయ సాధన సర్వే (న్యాస్) కింద పరీక్షలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.
మొత్తం 38.87 లక్షల మంది 3, 5, 8, 10 తరగతుల విద్యార్థులకు వివిధ సబ్జెక్టుల్లో కనీస పరిజ్ఞానాన్ని పరీక్షించనుంది. ఈసారి ప్రభుత్వ, ఎయిడెడ్‌తో పాటు ప్రైవేట్ పాఠశాలలను కూడా ఎంపిక చేశారు. తెలంగాణ నుంచి 4,936, విద్యార్థులు సర్వేలో పాల్గొననున్నారు. ఎంపికైన పాఠశాలలో ఒక్కో తరగతి నుంచి 30 మంది సర్వేలో పాల్గొన్నారు. మూడు, నాలుగు తరగతులకు మాతృభాష, గణితం, ఈవీఎస్, 8, 10 తరగతులకు మాతృభాష, గణితం, సోషల్, సైన్స్ ఆంగ్లం సబ్జెక్టుల్లో పరీక్షలు జరుపుతారు.
బహుళ ఐచ్చిక ప్రశ్నలు ఉండే ప్రశ్నపత్రాలు ఇస్తారు. మూడు, అయిదు తరగతులకు గంటన్నర, మిగిలిన తరగతులకు రెండు గంటల చొప్పున సమయం ఇవ్వడం జరిగింది. ఓఎంఆర్ పత్రంలో జవాబులు గుర్తించారు. సర్వే అనంతరం రాష్ట్రాలు, జిల్లాల వారీగా కేంద్రం సమగ్ర నివేదికలను విడుదల చేస్తోంది. ఏ రాష్ట్రంలో, ఏ జిల్లాలో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు ఎలా ఉన్నాయో అందులో పొందుపరుస్తారు. ఏ సబ్జెక్టులో, ఏ అంశాల్లో విద్యార్థుల పరిస్థితి ఎలా ఉందో నివేదికలు ఇస్తారు. ఆ ప్రకారం వచ్చే విద్యా సంవత్సరం పాఠశాల విద్యాశాఖ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. పాఠశాలలో వున్న మౌలిక సదుపాయాలు తధితర విషయాలు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, పాల్గొని వివరాలు అందజేశారు.