కామారెడ్డి, నవంబర్ 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం పక్కన గల మిస్టర్ టీ పాయింట్ హోటల్లో తెలంగాణ ప్రజా కవి కాళోజీ నారాయణరావు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు. అఖిల భారతీయ ప్రజా సేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ కామారెడ్డి జిల్లా ఇంచార్జ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకం శ్యామ్ రావు మాట్లాడుతూ పుట్టుక నీది చావు నీది బతుకంతా దేశానిది అన్న తెలంగాణ ఆత్మగౌరవ కలం కాలోజీ నారాయణరావు అన్న మాటలు మరువలేనివని అన్నారు.
తెలంగాణ తొలిపొద్దు కాళోజీ నారాయణరావు అని అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి- అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి అని అన్యాయాన్ని ఎదిరించినా వాడే నాకారాధ్యుడు అని గర్వంగా ప్రకటించి ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి కాలోజి నారాయణరావు అన్నారు. ప్రతి ఒక్కరూ మహనీయులను మరువద్దని, స్మరించుకోవాలని అన్నారు.
కార్యక్రమంలో సమాచార హక్కు చట్టం ప్రతినిధులు ఎంవీ. భాస్కర్, జాకీర్ హుస్సేన్, ఆనంద్, రాజయ్య, గౌస్ ఖాన్, అన్వర్, అజామ్ తదితరులు పాల్గొన్నారు.