వేల్పూర్, నవంబర్ 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేక పోతుల నరేందర్ గౌడ్, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు దేవరకొండ నరేష్ చారి ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లాలోని బీసీ సంక్షేమ కార్యాలయంలో వేల్పూర్ మండల బిసి సంక్షేమ సంఘం మహిళ అధ్యక్షురాలిగా గా ఇందారపు పుష్పకు శనివారం తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ బొబ్బిలి నరసయ్య, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అబ్బగోని అశోక్ గౌడ్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందించారు.
ఈ సందర్భంగా పుష్ప మాట్లాడుతూ వేల్పూర్ మండలంలోని బీసీ కులాల మహిళల అభ్యున్నతి కోసం పోరాడుతానని తెలిపారు. బీసీ మహిళలు రాజకీయంగా ఎదగాలని, మహిళలు అన్ని రంగాలలో రాణించాలని వారికీ అవసరమైన సహాయ సహకారాలు ఉంటాయని, బీసీసంక్షేమ సంఘం తరపున ఎల్లవేళలా పోరాడుతానని తెలిపారు.
అదేవిధంగా ప్రతి గ్రామంలో బిసి కులవృత్తి పై ఆధారపడి నివసిస్తున్న బిసి మహిళలకు తోడుగా ఉంటానని ఈ సందర్బంగా తెలిపారు. ఈ అవకాశాన్ని ఇచ్చిన రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కమిటీకి, జిల్లా బీసీ సంక్షేమ సంఘం కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థి బిసి సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు బ్రహ్మదండి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.