కామారెడ్డి, నవంబర్ 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని గిరిజన బాలుర వసతిగృహంను శనివారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. వసతి గృహంలోని మరుగుదొడ్లను పరిశీలించారు. కొన్ని గదులు శిథిలావస్థకు చేరడంతో వాటికి మరమ్మతులు చేయించాలని అధికారులను ఆదేశించారు.
కిటికీలకు జాలీలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. విద్యార్థులు ఇష్టపడి చదివి ఉన్నత స్థాయిలో నిలవాలని సూచించారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి అంబాజీ పాల్గొన్నారు.