కామారెడ్డి, నవంబర్ 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం కామారెడ్డి ఎస్‌పి కార్యాలయంలో అడిషనల్ ఎస్‌పి ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్న 3 డివిజన్ డిఎస్‌పిలు, 22 మండలాల ఎస్‌ఐలకు నిర్వహించబడిన సమావేశంలో సఖి సెంటర్ అడ్మినిస్ట్రేటర్ ఆర్. సాయవ్వ, కౌన్సిలర్ పుష్ప పాల్గొన్నారు.
ముఖ్యంగా సఖి సెంటర్ అందిస్తున్న 5 రకాల సేవల గురించి వివరిస్తూ అత్యవసర సమయంలో 181 కాల్ చేసిన్నప్పుడు సఖి సిబ్బంది అర్ధరాత్రి కూడ రెస్క్యూ చేస్తున్నాము కావున ఆ సమయంలో సంబంధిత పోలీస్ సిబ్బంది సపోర్ట్ కోరటం జరిగింది. మైనర్ గర్ల్ కేసు తప్పని సరిగా సిడబ్ల్యుసి ముందు హాజరు పరిచిన తర్వాతే తల్లిదండ్రులకు అప్పగించాలన్నారు. అందుకు కేసు గురించి సంబంధిత ఎస్‌ఐ, సిడబ్ల్యుసికి సమాచారం అందజేయాలన్నారు.
సఖి సెంటర్‌లో విక్టిమ్‌కు ఐదు రోజులు మాత్రమే షెల్టర్ సదుపాయం కల్పిస్తామని, పోలీస్ స్టేషన్‌కు వచ్చే డివిసి కేసు సఖి సెంటర్‌కు సైకో సోషల్ కౌన్సిలింగ్ కొరకు పంపగలరని పైన తెలిపిన సపోర్ట్ కొరగా తప్పకుండ అందచేస్తామని అడిషనల్ ఎస్‌పి, డిఎస్‌పి, ఎస్‌ఐలు తెలిపారు.