కామారెడ్డి, నవంబర్ 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం కామారెడ్డి పట్టణం ఈఎస్‌ఆర్ గార్డెన్‌లో మెగా లీగల్ క్యాంప్ నిర్వహించారు. కార్యక్రమానికి జూనియర్ సివిల్ జడ్జి కామారెడ్డి స్వాతి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి జె విక్రమ్ పాల్గొని మాట్లాడారు.
జాతీయ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థల ఆదేశాల మేరకు భారతావని 75 ఏళ్ల స్వతంత్ర దినోత్సవం పూర్తి చేసుకుంటున్న చారిత్రాత్మక శుభ రోజులలో ఆజాదీకా అమృత మహోత్సవంలో భాగంగా చట్టాల యొక్క ప్రాముఖ్యతను ప్రజలకు తెలిపారు. ఇందులో భాగంగా పాన్ ఇండియా అవగాహన, విస్తరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజలకు వివిధ చట్టాలపై అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో కామారెడ్డి పట్టణ డి.ఎస్.పి సోమనాథ్, కామారెడ్డి బార్ అసోసియేషన్ అధ్యక్షులు గజ్జల బిక్షపతి, ఉపాధ్యక్షులు గంగాధర్ న్యాయవాది ఎం.ఏ. సలీం న్యాయవాదులు మాయ సురేష్, భగత్ రెడ్డి, గోవర్ధన్, పిఎల్‌వి సభ్యులు జె జగ్గారెడ్డి, జై రవి, కే జగదీశ్వర్, ఎం గంగాధర్, పి సత్తయ్య, కే దుర్గా రెడ్డి, సిహెచ్ రామలింగం, పి.రామకృష్ణ, బాలయ్య, డిస్ట్రిక్ట్ ఉమెన్ ఆఫీసర్ సరస్వతి, జిల్లా బిఆర్‌బి కోఆర్డినేటర్ జానకి, సఖి సెంటర్ సిఎ సాయవ్వ, సిడిపిఓ స్రవంతి, డాక్టర్, మహిళలు, ఆశావర్క తదితరులు పాల్గొన్నారు