నిజామాబాద్, నవంబర్ 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లాలో 102 కొత్త వైన్‌షాప్‌లకు నోటిఫికేషన్ జారీచేసినట్టు సంబంధిత అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిజామాబాద్ ఎక్సైజ్ స్టేషన్-(35) ఏ4 షాప్ లకు – 116 అప్లికేషన్లు, ఆర్మూరు ఎక్సైజ్ స్టేషన్-(26) ఏ 4 షాప్‌లకు-30 అప్లికేషన్లు, బోధన్ ఎక్సైజ్ స్టేషన్-(18) ఏ4 షాప్‌లకు-28అప్లికేషన్లు, భీంగల్ ఎక్సైజ్ స్టేషన్-(12) ఏ4 షాప్‌లకు -26 అప్లికేషన్లు, మోర్తాడ్ ఎక్సైజ్ స్టేషన్ -(11) ఏ4 షాప్‌లకు-17 అప్లికేషన్లు సోమవారం వరకు వచ్చినట్టు పేర్కొన్నారు.
నిజామాబాదు జిల్లాలో సోమవారం వరకు వచ్చిన అప్లికేషన్లు మొత్తం 217, కాగా సోమవారం ఒక్కరోజే 179 దరఖాస్తులు వచ్చాయన్నారు. దరఖాస్తులు దాఖలు చేయుటకు చివరి తేదీ ఈనెల 18, డ్రా తేదీ 20, తిలక్ గార్డెన్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం, నిజామాబాద్‌లో ఉంటుందన్నారు. దరఖాస్తు దారుడు (3) పాస్ పోర్ట్ సైజు ఫొటోలు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, రెండు లక్షల రూపాయలు దరఖాస్తు రుసుం చెల్లించాలన్నారు.
దరఖాస్తుదారులు ఈనెల 8వ తేదీన తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవో.నెంబర్.100 ప్రకారం ఒక దరఖాస్తుదారుడు ఒక్క ఏ4 షాప్‌కి ఒక్క వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా దరఖాస్తు చేసుకోవచ్చని, ఎన్ని ఏ4 షాపులకు అయిన దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఒక వేళ లక్కీ డ్రా లో ఒకటి కంటే ఎక్కువ షాపులు వచ్చిన ఎడల అతనికే అన్ని లైసెన్సులు కేటాయించబడుతాయన్నారు.
దరఖాస్తు చేయడం చాలా సులువు కావున ఆసక్తికలవారు విరివిగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ అధికారి డాక్టర్ నవీన్ చంద్ర తెలిపారు.