బిర్సాముండా ఆశయాలతో ముందుకు సాగుదాం…

ఆర్మూర్‌, నవంబర్‌ 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా గిరిజన మోర్చా (బిజెజిఎం) ఆర్మూర్‌ పట్టణ శాఖ ఉపాధ్యక్షులు గూగులోత్‌ తిరుపతి నాయక్‌ ఆధ్వర్యంలో భగవాన్‌ బిర్సా ముండా 146 వ జయంతిని పురస్కరించుకుని ఆర్మూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్‌ చౌరస్తా వద్ద బిర్సాముండా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్బంగా బిజెపి నిజామాబాద్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.వి. నరసింహారెడ్డి, బిజెపి ఆర్మూర్‌ పట్టణ అధ్యక్షులు జెస్సు అనిల్‌ కుమార్‌, భారతీయ జనతా గిరిజన మోర్చా ఆర్మూర్‌ పట్టణ ఉపాధ్యక్షులు గూగులోత్‌ తిరుపతి నాయక్‌ మాట్లాడారు. శ్రీ భగవాన్‌ బిర్సాముండా ఆదివాసుల హక్కుల కోసం పోరాడటమే కాకుండా దేశ స్వాతంత్రం కోసం ఆంగ్లేయులకు వ్యతిరేకంగా జల్‌ – జంగల్‌ – జమీన్‌ అనే లక్ష్యంతో మిలీనియర్‌ ఉద్యమానికి సారథ్యం వహించి పోరాటం చేయడంతో ఆంగ్లేయులు బిర్సాముండా పోరాటపటిమను చూసి భయభ్రాంతులకు లోనై కుట్రతో పట్టుకొని జైలులో వేసి అందులోనే హతమార్చడం జరిగిందన్నారు.

25 సంవత్సరాల ప్రాయంలోనే దేశం కోసం, గిరిజన జాతుల సంస్కృతిని కాపాడడం కోసం తన ప్రాణాలు సైతం త్యాగం చేసిన మహావీరుడని, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇలాంటి దేశభక్తులను విస్మరించడం దురదృష్టకరమని అన్నారు. కానీ 2014లో ఎప్పుడైతే నరేంద్ర మోడీ భారత దేశ ప్రధాన మంత్రి అయ్యారో గిరిజనులను, ఆదివాసులను విస్మరించకుండా బిర్సా ముండా చిత్రపటాన్ని భారత పార్లమెంటులో ఆవిష్కరించడం, అంతేకాకుండా ఈ రోజు బిర్సా ముండా యొక్క జీవిత చరిత్ర సంబంధించిన మ్యూజియంను ప్రారంభించడం భారతీయ జనతా పార్టీకి అదేవిధంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఆదివాసుల పట్ల ఉన్నటు గౌరవాన్ని తెలియజేస్తుందన్నారు.

కానీ తెలంగాణలో టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆదివాసుల కోసం, గిరిజనుల కోసం 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి ఇప్పటికి ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పటికీ, కల్వకుంట్ల చంద్రశేఖర రావు పూట పూటకు అబద్ధాలు మాట్లాడడం తప్ప తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల అభివృద్ధికోసం పాటు పడిన దాఖలాలు లేవని, అదేవిధంగా వివిధ వర్గాల అభివృద్ధిపై గాని, తెలంగాణ అభివృద్ధిపై గాని చిత్తశుద్ధి లేకపోవడం తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ యొక్క మాయమాటలు గమనిస్తున్నారని రాబోయే కాలంలో తెలంగాణ యువత బిర్సా ముండా ఆశయాలను ఆదర్శంగా తీసుకుని టిఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని గద్దె దించడానికై మరో పోరాటానికి సిద్ధం కావాలని ఈ సందర్భంగా తెలిపారు.

కార్యక్రమంలో బిజెపి ఆర్మూర్‌ పట్టణ కార్యదర్శి ఖాందేశ్‌ ప్రశాంత్‌, బిజెపి ఆర్మూర్‌ పట్టణ సీనియర్‌ నాయకులు భూపేందర్‌, గిరిజన మోర్చా ఆర్మూరు పట్టణ ప్రధాన కార్యదర్శులు ధరావత్‌ మోహన్‌ నాయక్‌, మూడ మనోజ్‌, ఒబిసి మోర్చా ఆర్మూర్‌ పట్టణ ప్రధాన కార్యదర్శి మిర్యాల్‌కర్‌ కిరణ్‌, ఉపాధ్యక్షులు కత్రాజి రవిప్రసాద్‌, కార్యదర్శి కాశ శ్రీకాంత్‌ బిజెపి, వివిధ మోర్చాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శుక్రవారం, నవంబరు 22, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »