కామారెడ్డి, నవంబర్ 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ జాతీయ రహదారి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో 765, డి, జాతీయ రహదారి పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
అటవీ, మిషన్ భగీరథ, విద్యుత్తు, హైవే అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. శాఖల వారీగా పనులు పెండిరగ్ లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఆర్డివోలు శీను, రాజా గౌడ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.