కామారెడ్డి, నవంబర్ 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం ఉదయం తెలంగాణ విశ్వవిద్యాలయ అనుబంధ సంస్థ అయిన కామారెడ్డిలోని ఆర్.కె. డిగ్రీ కళాశాలను ఉపకులపతి ఆచార్య డి.రవీందర్ గుప్త ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా తరగతి గదులలోని విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగారు.
ఈ మధ్యనే ఉపకులపతి ఆచార్య రవీందర్ ప్రపంచ స్థాయి సైంటిస్ట్ రెండవ కేటగిరీలో రావడం అనేది మన విశ్వవిద్యాలయానికి గర్వకారణం అని ఆర్.కె.కళాశాల అధినేత జైపాల్ తెలిపారు. విసిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. తనికీలో విశ్వవిద్యాలయ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య విద్యావర్దిని, జాయింట్ డైరెక్టర్ బాలకిషన్ పాల్గొన్నారు.