కామారెడ్డి, నవంబర్ 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో మందాపూర్ గ్రామానికి చెందిన మద్దుల లావణ్య రక్తహీనతతో బాధపడుతుండముతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. వారికి కావలసిన 1 యూనిట్ ఏ పాజిటివ్ రక్తాన్ని వి.టి.ఠాకూర్ బ్లడ్ బ్యాంకులో లింగంపేట్కి చెందిన డిఅర్ డిఏలో ఐకేపి సిసిగా విధులు నిర్వహిస్తున్న మునోత్ సంజీవులు సహకారంతో సకాలంలో రక్తాన్ని అందజేసినట్లు తెలిపారు.
రక్తదానానికి ముందుకు వచ్చిన రక్తదాతను అభినందించారు. అత్యవసర పరిస్థితులలో, ఆపదలో ఉన్నవారు రక్తం అవసరమైన వారు 9492874006 నెంబర్కి సంప్రదించినట్లయితే వారికి కావాల్సిన రక్తాన్ని అందజేస్తామన్నారు. కార్యక్రమంలో ప్రతినిధులు బల్ల శ్రీనివాస్, అంజల్ రెడ్డి, టెక్నీషియన్ అర్చన పాల్గొన్నారు.