డిచ్పల్లి, నవంబర్ 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ అప్లయిడ్ ఏకనమిక్స్లో పనిచేస్తున్న డా. స్వప్నని పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ హెచ్.ఓ.డిగా ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ ఆదేశాలతో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరి నియామక పత్రాన్ని అందజేశారు.
డా. స్వప్న మాట్లాడుతూ తనకు ఇచ్చిన అవకాశాన్ని బాధ్యతగా నిర్వర్తిస్తానని చెప్పారు. స్వప్న గతంలో క్రింది అడ్మినిస్ట్రేటివ్ పదవులు నిర్వర్తించారు.
- బోర్డ్ ఆఫ్ స్టఫీస్ చైర్మన్ ఎకనామిక్స్.
- బాలికల కోసం హాస్టల్ వార్డెన్.
- ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ యూనిట్-1.
- ఏపిఐవో
- ఎగ్జామినేషన్స్ యు.జి. కాన్ఫిడెన్షియల్ అదనపు కంట్రోలర్‌గా పనిచేశారు.