నిజామాబాద్, నవంబర్ 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేక పోతుల నరేందర్ గౌడ్, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు దేవరకొండ నరేష్ చారి ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లాలోని బీసీ సంక్షేమ కార్యాలయంలో నిజామాబాద్ జిల్లా బిసి సంక్షేమ సంఘం మహిళ అధ్యక్షురాలిగా రాజ్యలక్ష్మికి సోమవారం తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ బొబ్బిలి నరసయ్య, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అబ్బగోని అశోక్ గౌడ్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందించారు.
ఈ సందర్భంగా రాజ్యలక్ష్మి మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా బీసీ కులాల మహిళల అభ్యున్నతి కోసం పోరాడుతానని తెలిపారు. గతంలో మహిళా సంఘాలలో పనిచేసిన అనుభవం ఉందని మహిళలకు ఎలాంటి ఆపద ఎదురైనా అన్ని వేళల తోడుంటానని తెలిపారు. బీసీ మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపైన పోరాడుతానని పేర్కొన్నారు. బీసీలపైనా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయని. బీసీల కులాధారిత జనగణన జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పక్షులకు జంతువులకు లెక్కలు ఉన్నాయని మరి బీసీలకు లెక్కలు ఎందుకు లేవని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే కుల గణన జరపకపోతే బీసీల ఉద్యమం తీవ్రస్థాయికి చేరుతుందని అన్నారు. బీసీ మహిళలలు రాజకీయంగా ఎదగాలని, మహిళలు అన్ని రంగాలలో రాణించాలని వారికీ అవసరమైన సహాయ సహకారాలు ఉంటాయనీ తెలిపారు.
అవకాశాన్ని ఇచ్చినటువంటి రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కమిటీకి జిల్లా బీసీ సంక్షేమ సంఘం కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం, నిజామాబాద్ జిల్లా బీసీ సభ్యులు పాల్గొన్నారు.