కామారెడ్డి, నవంబర్ 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. బీర్కుర్ తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం దాన్యం కొనుగోలుపై జరిగిన వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడారు. రైతులకు ఇబ్బందులు కలుగకుండా ధాన్యం సేకరణ జరిగే విధంగా చూడాలని కోరారు.
రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను ఎప్పటికప్పుడు ట్యాబ్‌లో ఎంట్రీ చేయాలని అధికారులను ఆదేశించారు. ట్యాబ్ ఎంట్రీలో జాప్యం లేకుండా చూడవలసిన బాధ్యత కేంద్రాల నిర్వాహకులదేనని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో బాన్సువాడ ఆర్డిఓ రాజాగౌడ్, సివిల్ సప్లై డిఎం జితేంద్ర ప్రసాద్, ఇన్చార్జి డిఎస్‌ఓ రాజశేఖర్, అధికారులు పాల్గొన్నారు.