ఆర్మూర్, నవంబర్ 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఆర్మూర్ మున్సిపల్ ఛైర్ పర్సన్ పండిట్ వినీత పవన్, కౌన్సిలర్ భారతి, కౌన్సిలర్ సుజాత హాజరయ్యారు.
బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. అనంతరం పండిట్ వినీతా మాట్లాడుతూ నేటి విద్యార్థులే రేపటి పౌరులని..వారిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర చాలా ముఖ్యమైనదని కొనియాడారు. పాఠశాల ప్రిన్సిపాల్ ముత్తు నందిపాటి మాట్లాడుతూ రేపటి సమాజం కోసం అహర్నిశలు కష్టపడుతున్న ఉపాధ్యాయులను, వారికి అన్ని విధాలా సహకరిస్తున్న తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో శ్రీ చైతన్య పాఠశాలల డిజిఎం జీ.ఎల్.ఆర్, ఆర్.ఐ రాజు, ప్రిన్సిపాల్ ముత్తు, డీన్ వెంకటేష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.