కామారెడ్డి, నవంబర్ 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : లక్ష్యానికి అనుగుణంగా బ్యాంకులు పంట రుణాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో డిసిసి సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో బ్యాంకర్లు పంట రుణాలపై రైతు వేదికల్లో రైతులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు.
రైతులు నిర్ణీత సమయంలో పంట రుణాలు నవీకరణ (రెన్యువల్) చేసుకోవాలని కోరారు. స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలు ఇవ్వాలని ఆదేశించారు. విద్య, గృహ రుణాలు బ్యాంకర్లు తమ లక్ష్యాలకు అనుగుణంగా ఇవ్వాలని పేర్కొన్నారు. రైతులకు గేదెల కొనుగోలు కోసం రుణాలను మంజూరు చేయాలని బ్యాంకర్లను ఆదేశించారు.
స్వయం సహాయక సంఘాల రుణాల బకాయిలు ఉంటే వాటిని తక్షణమే వసూలు చేయాలని పేర్కొన్నారు. పొటెన్షియల్ లింకుడు క్రెడిట్ ప్లాన్ పుస్తకాలను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆవిష్కరించారు. సమావేశంలో ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వెంకట మాధవరావు, జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, జిల్లా ఎస్సీ వసతి గృహాలు అధికారిని రజిత, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్, జిల్లా పశువైద్యాధికారి జగన్నాథం, ఎల్‌డిఎం రాజేందర్ రెడ్డి, నాబార్డు డిడిఎం నగేష్, ఆర్‌బిఐ ఏజీఎం రహమాన్, కెనరా బ్యాంక్ ఎజిఎం శ్రీనివాస రావు, ఎస్‌బిఐ ఎజిఎం పల్లంరాజు, బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు.