కామారెడ్డి, నవంబర్ 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో జాప్యం లేకుండా చూడాలని సహకార సంఘాల చైర్మన్లు బుధవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ను కలిశారు. ఆయా మండలాల్లో ఉన్న సహకార సంఘాల కొనుగోలు కేంద్రాలలో కొనుగోలు చేపట్టిన ధాన్యాన్ని స్థానికంగా రైస్ మిల్లకు అప్పగించే విధంగా చూడాలని కోరారు.
లారీలను పంపడంలో ట్రాన్స్పోర్ట్ నిర్వాహకులు జాప్యం చేస్తున్నారని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. సమస్యలను పరిష్కరిస్తానని కలెక్టర్ పేర్కొన్నారు. తాడ్వాయి, సదాశివనగర్, అడ్లూర్ ఎల్లారెడ్డి, లింగంపేట, గాంధారి, అరుగొండ సహకార సంఘాల చైర్మన్లు కపిల్ రెడ్డి, కమలాకర్ రావు, సదాశివ రెడ్డి దేవేందర్ రెడ్డి, సాయిరాం, శివరాంలు పాల్గొన్నారు.