కామారెడ్డి, నవంబర్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్రంలో టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు ధర్నాలు చేయడం హాస్యాస్పదమని నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ధర్నాలు చేయాల్సింది నిరుద్యోగులు విద్యార్థులు అని టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బాలు అన్నారు. కేసీఆర్ రైతులు పండిరచిన ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయకపోవడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడి రైతులు పండిరచిన ధాన్యం నాని పోవడం జరిగిందని దీనికి పూర్తి బాధ్యత టిఆర్‌ఎస్ ప్రభుత్వానిదే అన్నారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 200 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని కెసిఆర్ పాలనలో ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితిని 58 నుండి 61 సంవత్సరాల పెంచారన్నారు. తెలంగాణ రాష్ట్రం నుండి కేసీఆర్ కుటుంబాన్ని తరిమి కొడితేనే ఈ ప్రాంతానికి న్యాయం జరుగుతుందన్నారు.
కెసిఆర్ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ధర్నా పేరుతో డ్రామాలాడుతున్నారని ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వానికి ఓటమి తప్పదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర వ్యాప్తంగా పెండిరగ్‌లో ఉన్న ఫీజు రియంబర్స్‌మెంట్‌లను విడుదల చేయాలని, ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో టిఎన్‌ఎస్‌ఎఫ్ నాయకులు రాజు, రవి, సందీప్, సతీష్, మహిపాల్, నవీన్ తదితరులున్నారు.