నిజామాబాద్, నవంబర్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా ముద్దుబిడ్డ, మాజీ కలెక్టర్ చిరంజీవులు ఐ.ఏ.ఎస్, యుబియుఎన్‌టియు సామాజిక సేవా సంస్థను స్థాపించారు. సంస్థ ద్వారా ఉచితంగా గ్రూప్స్ కోచింగ్ ఇవ్వడానికి ముందుకొచ్చారు.
కోచింగ్ పొందాలనుకునేవారు ఉదయం టీ, మధ్యాహ్నం బోజనం, సాయంత్రం టీ స్నాక్స్ కొరకు రోజుకు 35 రూపాయల చొప్పున విద్యార్థులు చెల్లించవలసి ఉంటుందని, 100 మంది యువకులకు, 100 మంది యువతులకు మొత్తం 200 మంది విద్యార్థులకు రెండు నెలల పాటు ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్టు ఆయన తెలిపారు.
యువకులకు కేర్ డిగ్రీ కళాశాలలో తరగతులు ఏర్పాటు చేశారు. ఉచిత గ్రూప్స్ కోచింగ్‌లో చేరదలచిన వారు వెబ్ సైట్ www.ubuntutrust.org.in చూడండి. ఈ నెల 25 లోపల దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. డిసెంబర్ 1 నుండి తరగతులు ప్రారంభం అవుతాయన్నారు. మరిన్ని వివరాలకు నరేష్ సెల్ నెంబరు 8008222645 లో సంప్రదించాలన్నారు.