కామారెడ్డి, నవంబర్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని ధ్యాన మందిరంలో గురువారం ఆయన ద్వాదశ జ్యోతిర్లింగాల ఆలయంను ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ధ్యానం చేయడం వల్ల ఒత్తిడిని అధిగమించవచ్చునని సూచించారు.
ఆధ్యాత్మిక సేవలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని సూచించారు. కార్తీక మాసం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ధ్యానం చేశారు. ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ప్రతినిధి జయదీదీ మాట్లాడారు. దాతల సహకారంతో ధ్యాన మందిరం అభివృద్ధి చెందిందని చెప్పారు. ప్రేమ, ఐక్యత, పవిత్రత, గౌరవం, నిజాయితీ వంటి లక్షణాలను సమాజంలోని వ్యక్తులు అలవర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బాంబే క్లాత్ హౌస్ ప్రతినిధి వీటి లాల్, యోగ ప్రతినిధులు రామ్ రెడ్డి, నగేష్, బ్రహ్మ కుమారీలు పాల్గొన్నారు.