నిజామాబాద్, నవంబర్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్‌ఎఫ్‌ఐ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రికి వినతి పత్రం అందించారు. అదే విధంగా యూనివర్సిటీ అక్రమాలపై ప్రత్యేక కమిటీ వేసి అర్హతలు లేని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఉన్నత విద్యా మండలి తెలంగాణ విశ్వవిద్యాలయాన్ని అక్రమార్కుల నుండి రక్షించాలని కోరారు. అలాగే తెలంగాణ విశ్వవిద్యాలయన్ని పరిశోధన కేంద్రంగా మార్చి విద్యారంగం అభివృద్ధికి తోడ్పాటు అందించాలన్నారు.
అదేవిధంగా అక్రమ పదోన్నతులకు అడ్డుకట్ట వేసి అవినీతి చెర నుండి కాపాడాలని విన్నవించారు. యూనివర్సిటీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. అర్హతలేని క్లాస్ 2 పాలకమండలిని రద్దు చేసి నూతన పాలక మండలి ఏర్పాటు కోసం ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళ్లాలని కోరారు. వినతి పత్రం అందించిన వారిలో రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఆర్‌ఎల్ మూర్తి, టీ నాగరాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటికొండ రవి, నిజామాబాద్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాచకొండ విగ్నేష్, బొడ అనిల్, జిల్లా ఉపాధ్యక్షులు సిద్ధల నాగరాజు, యూనివర్సిటీ నాయకులు ముస్తఫా, శ్రీశైలం, క్రాంతి రతన్, తదితర నాయకులు పాల్గొన్నారు.