కామారెడ్డి, నవంబర్ 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మండలం ఉగ్రవాయి గ్రామానికి చెందిన భారతికి పురిటి నొప్పులు రావడంతో 108 అంబులెన్స్‌కు రాత్రి వేళ ఫోను చేయగా అంబులెన్స్ సిబ్బంది అక్కడికి సకాలంలో చేరుకొని దొమ్మట భారతి (25)ను ఆసుపత్రికి తరలించే ప్రయత్నంలో నొప్పులు అధికం కావడంతో కామారెడ్డికి సమీపంలో బైపాస్ రోడ్డు వద్ద ఆమెకు అంబులెన్స్‌లోనే సుఖప్రసవం చేశారు.
బిడ్డ మెడ చుట్టూ బొడ్డు త్రాడు చుట్టుకొని ఉండడం, సాధారణ ప్రసవం జరిగే పరిస్థితి లేక పోయినప్పటికీ, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అంబులెన్స్ సిబ్బంది, హైదరాబాద్ 108 కాల్ సెంటర్‌లోని డాక్టర్ ఈశ్వర్‌ని ఫోన్ ద్వారా సంప్రదించి, తగిన సలహా, సూచనలు తీసుకొని, చాలా చాక చక్యంగా సాధారణ ప్రసవం చేసి తల్లి బిడ్డలను కాపాడారు.
రెండవ కాన్పు కావడంతో అడబిడ్డ జన్మించినది. తల్లి, బిడ్డలను తదుపరి వైద్య సేవల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి, కామారెడ్డిలో చేర్పించినట్లు సిబ్బంది తెలిపారు. 108 అంబులెన్సు సిబ్బంది ఈఎంటి అంజయ్య, పైలట్ రామశంకర్‌లకు ఆమె భర్త శేఖర్ కృతజ్ఞతలు తెలిపారు.