బాలలను అభివృద్ధి పథంలో ఎదగనీయాలి…

కామారెడ్డి, నవంబర్‌ 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాల బాలికలను అభివ ృద్ధి పథంలో ఎదగనీయాలనీ జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి అన్నారు. ఈ నెల 14 నుండి 20వ తేదీ వరకు జరుగుతున్న జాతీయ బాలలతో స్నేహ పూరిత వారోత్సవాలలో భాగముగా మహిళ అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ, రోజ్‌ చైల్డ్‌ లైన్‌ 1098 కామారెడ్డి ఆధ్వర్యంలో కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో బాలల హక్కుల వారోత్సవాల వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి మాట్లాడుతూ బాలలను అభినందిస్తూ బాలల వారోత్సవాలు సంవత్సరంలో ఒకసారి కాదు అని, ప్రతి వారం బాలల వారోత్సవాలే అన్నారు. పిల్లలకు ఎటువంటి ఆపదలు వచ్చినా చైల్డ్‌ లైన్‌ 108 వారికి తెలియజేయాలని, వారు వెంటనే స్పంంచి వస్తారని, ఇంటిలో వారికి చెప్పుకోలేనివి కూడా 1098కి ఫోన్‌ చేసి చెప్పవచ్చన్నారు. బాలికలు అన్ని రంగాలలో ముందంజలో ఉంటున్నారని, బాలికలు ముఖ్యంగా విద్య, పోషణ, చట్ట పరమైన హక్కులు, వైద్య సంరక్షణ, రక్షణ, బలవంతపు బాల్యవివాహాల గురించి అవగాహన పెంచుకోవాలని సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందినా ఇంకా ఆడపిల్లల పైన వివక్షత తగ్గడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.

ఉన్నత విద్యా, ఉద్యోగాలలో ఆడవాళ్ళు ఉన్నా మగ వారితో పోలిస్తే ఈ సంఖ్య ఆశాజనకంగా లేదన్నారు. ఉన్నత కంపెనీలలో సీఈవోలుగా ఎదగవచ్చన్నారు. యస్‌ఆర్‌ స్థాయి ఉద్యోగాలలో ఆడవారు తక్కువ సంఖ్యలో ఉన్నారని ఈ వివక్షత అనేది పోవాలంటే ఆడ పిల్లలు ఉన్నత విద్య చదివి ఉన్నత ఉద్యోగాలలో ఉండాలన్నారు. అప్పుడే మనం లింగ సమానత్వం సాధించినట్లు అని తెలిపారు.

ప్రతి ఒక్కరు లక్ష్యం ఏర్పాటు చేసుకొని అందుకు అనుగుణంగా ప్రణాళికలు తయారు చేసుకొని ఆ దిశగా అడుగులు వేయండని కష్టపడి కాకుండా ఇష్టపడి చదువుకోవాలని మంచి వ్యక్తిత్వం గల విద్యార్థులుగా సమాజం కోసం సేవ చేసే సైనికులుగా సహాయపడాలని విలువలతో కూడిన సమాజ నిర్మాణానికి ముందు అడుగు వేద్దాం అని తెలిపారు.

బాలల సంక్షేమ కమిటీ సభ్యులు స్వర్ణలత మాట్లాడుతూ సమాజంలో మహిళల పట్ల జరుగుతున్న హింసలు అత్యాచారాలు, పిల్లలపై అఘాయిత్యాలు రోజురోజుకి పెచ్చరిల్లిపోతున్నాయని, వీటన్నిటినీ దైర్యంగ ఎదుర్కోవాలని ఆడవాళ్ళు సమయం వచ్చినప్పుడు ఆది పరాశక్తులుగా తయారు కావాలని, బాలికలు సత్ప్రవర్తనతో బాధ్యతాయుతమైన జీవితం గడపాలని తెలిపారు.

సిడిపిఓ రోచిష్మా మాట్లాడుతూ ఈ సృష్టిలో జన్మను ఇచ్చేవి రెండు ఒకటి భూ మాత, రెండు మహిళలు అని, ఇలాంటి వారు ఈ సృష్టిలో ఇంకెక్కడ లేరని జీవితంలో మంచి సమాజ నిర్మాణానికి మనం మొదటి వరుసలో ఉంటాము, ఉన్నత చదువులు చదివి గొప్ప స్థాయిలో ఉన్నప్పుడు తల్లి తండ్రులకు గురువులకు ఇచ్చే బహుమతి అని తెలిపారు.

కార్యక్రమంలో చైల్డ్‌ లైన్‌ 1098 కు కాల్‌ చేస్తే ఎవరెవరికి కాల్‌ వెళ్తుంది ఎన్ని రకాల అధికారులు పని చేస్తారో నాటిక ద్వారా చేసి చూపించారు. అనంతరం చైల్డ్‌ లైన్‌ సే దోస్తీ చైల్డ్‌ లైన్‌ 1098 సేవల గోడ ప్రతులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో చైల్డ్‌ లైన్‌ 1098 జిల్లా ప్రోగ్రాం కో ఆర్డినేటర్‌ అమృత రాజేందర్‌, చైల్డ్‌ లైన్‌ సిబ్బంది రవి, అరుణ, కిషోర్‌, సఖి సిబ్బంది కవిత, కేజిబివి సిబ్బంది రెబిక, అంగన్‌వాడీ కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, నవంబరు 23, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »