నిజామాబాద్, నవంబర్ 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా యందు 2021-23 (ఏ 4) మద్యం దుకాణాల లైసెన్సుల దరఖాస్తుల స్వీకరణ గురువారంతో ముగిసింది. మొత్తం 102 దుకాణాలకు 1672 దరఖాస్తులు వచ్చాయి. నూతన లైసెన్స్ మంజూరు కొరకు శనివారం 20వ తేదీ జరగబోయే లక్కీ డ్రా నిర్వహించే వేదిక నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంను జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి శుక్రవారం పరిశీలించారు.
డ్రా కార్యక్రమం విజయవంతంగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారి డాక్టర్ నవీన్ చంద్ర, నిజామాబాద్ ఎన్‌ఫోర్సుమెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ నందగోపాల్, ఎక్సైజ్ సి.ఐ సాయన్న పాల్గొన్నారు. రేపు జరగబోయే లక్కీ డ్రా కు ఉదయం 10 గంటల వరకు రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో తప్పనిసరిగా దరఖాస్తుదారులు హాజరు కావాలని, కలెక్టర్ 11 గంటలకు డ్రా తీయడం జరుగుతుందన్నారు. లక్కీ డ్రా లో షాప్ దక్కించుకున్న లైసెన్స్ దారుడు లైసెన్స్ ఫీస్ మొదటి ఇన్‌స్టాల్ మెంట్ చెల్లించాలన్నారు. అందుకు ఆడిటోరియంలో బ్యాంక్ కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఉన్నతాధికారులు సూచన మేరకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు.