కామారెడ్డి, నవంబర్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి 69 ఫిర్యాదులు వచ్చినట్లు ఇన్చార్జి జిల్లా అదనపు కలెక్టర్ వెంకట మాధవ రావు తెలిపారు.
సోమవారం ఆయన ప్రజావాణి ద్వారా వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. వచ్చిన ఫిర్యాదులు సంబంధిత శాఖ అధికారులు తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. రెవిన్యూ 40, గ్రామ పంచాయతీలకు సంబంధించి 16, మున్సిపల్ మూడు, వైద్యం, రోడ్లు శాఖలకు రెండు చొప్పున, వ్యవసాయం, విద్య, అటవీశాఖ, మిషన్ భగీరథ, ఉపాధి హామీ పథకం, పశు వైద్యం ఒకటి చొప్పున ఫిర్యాదులు వచ్చినట్లు ఆయన చెప్పారు.