ఆర్మూర్, నవంబర్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో ఆర్మూర్ ప్రభుత్వ పాఠశాలల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆర్మూరు మండల కార్యదర్శి సిద్ధాల నాగరాజు ముఖ్య అతిథులు ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు రాచకొండ విగ్నేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత ఏడు సంవత్సరాల నుండి విద్యారంగాన్ని విస్మరించిందని అన్నారు.
అదేవిధంగా ఖాళీగా ఉన్న 20 వేల టీచింగ్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. దాంతో పాటు ఆర్మూర్ బాలికల పాఠశాల బాలుర పాఠశాలలో త్రాగునీటి మౌలిక సదుపాయాలు లేనందున విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న మండల అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు.
అలాగే ప్రభుత్వ పాఠశాలలో సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అనే చందంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చిన టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఇప్పటికీ పట్టించుకోలేదన్నారు. ప్రభుత్వ పాఠశాలలను 10 లక్షల గ్రాంట్స్‌తో అభివృద్ధి చేయాలని అన్నారు. మధ్యాహ్న భోజన పథకానికి అధిక నిధులు కేటాయించాలని, కేటాయించకపోవడం వల్ల విద్యార్థులు అర్ధాకలితో అలమటిస్తున్నారన్నారు.
ప్రభుత్వం బాధ్యత వహించి విద్యార్థులకు పౌష్టికాహారం, త్రాగునీటి వసతులు కల్పించాలని లేనిచో ఉద్యమాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ మండల నాయకులు సురేందర, హరిదాస్, బహదూర్ సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు.