కామారెడ్డి, నవంబర్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా ఇంచార్జ్ జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారిగా టి.దయానంద్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు.
ఇంతవరకు ఇన్చార్జి జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారిగా ఉన్న శబ్న హైదరాబాద్ ఉపాధి కల్పన కార్యాలయానికి డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా పదోన్నతిపై వెళ్లారు. ఈ సందర్బంగా ఇంచార్జి మైనార్టీ సంక్షేమ అధికారి టి. దయానంద్ జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.