కామారెడ్డి, నవంబర్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాచారెడ్డి మండలం లచ్చపేట శివార్లు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు స్థలాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. ప్రభుత్వ స్థలాన్ని ఎంపిక చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. వారం రోజుల్లో స్థలాన్ని గుర్తించాలని పేర్కొన్నారు.
ఆర్డిఓ శీను, తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్ ఇన్ఫ్రస్ట్రక్చర్ కార్పొరేషన్ డిప్యూటీ జనరల్ మేనేజర్ రామదాసు, ప్రాజెక్ట్ ఇంజనీర్ శివకృష్ణ, తహసిల్దార్ శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు.