నిజామాబాద్, నవంబర్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హరితహారానికి నర్సరీలు ఎంతో ముఖ్యమైనవని, ఈ పనులు పక్కాగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సినారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సంబంధిత అధికారులతో కలెక్టరేట్ నుండి పలు అంశాలపై సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడారు.
లేబర్ టర్నవుట్ సిస్టమేటిక్‌గా మెయింటెన్ చేయాలని, కింది వాళ్లను గైడ్ చేస్తూ వెళ్లాలని, నర్సరీలలో సాయిల్ కలెక్షన్ రేపు, ఎల్లుండి పూర్తి కావాలన్నారు. బ్యాగ్ ఫిల్లింగ్ బుధవారం నాటికి 100 శాతం పూర్తి కావాన్నారు. గట్టిగా పని చేయించాలని రేపు 50 శాతం ఎల్లుండి 50 శాతం పూర్తి చేయాలని ఆదేశించారు. బృహత్ పల్లె ప్రకృతి వనాలు శనివారం వరకు 100 శాతం పూర్తి కావాలని, అన్ని రకాల పనులు పూర్తి కావాలన్నారు.
ఎవిన్యూ ప్లాంటేషన్ నేషనల్ హైవే 44, 63లో ఉన్న హరితహారం మొక్కలు ప్రతి ప్లాంట్‌కు ట్రీ గార్డ్స్‌కు కర్ర ఉండాలని పిచ్చి మొక్కలు క్లియర్ చేయాలని, వాటరింగ్ చేయాలని రేపు ఉదయం 8 నుండి సాయంత్రం 5 వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ఆర్‌అండ్‌బి, నేషనల్ హైవేపై ఉన్న హరితహారం మొక్కలు ఎండితే వాటి స్థానంలో కొత్తవి నాటాలని తెలిపారు.
డిచ్‌పల్లి హైవేలో డ్యామేజ్ అయిన మొక్కలను రిప్లేస్ చేయించాలని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ చిత్రా మిశ్రా, జెడ్పీ సీఈవో గోవింద్, డిఆర్‌డివో చందర్ నాయక్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.