బోధన్, నవంబర్ 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 25వ తేదీన హైదరాబాదులోని ఇందిరా పార్క్ వద్ద జరిగే మహాధర్నా విజయవంతం చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ బోధన్ సబ్ డివిజన్ కార్యదర్శి బి. మల్లేష్ పిలుపునిచ్చారు.
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో 25 నాటి మహాధర్నా గోడ ప్రతుల ఆవిష్కరణ సందర్భంగా బి. మల్లేష్ మాట్లాడారు. రైతు ఉద్యమం ప్రారంభమై సంవత్సరం అవుతున్న సందర్భంగా మూడు వ్యవసాయ చట్టాల రద్దును ఆహ్వానిస్తూ కనీస మద్దతు ధరల గ్యారెంటీ కోసం, విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరణ, పోడు భూములు, పేదలు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని, వరి కొనుగోలు డిమాండ్ల సాధనకై ఇందిరా పార్కు వద్ద జరుగు మహాధర్నాలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మల్లేష్ పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో పడాల శంకర్, గంధం సీతారాం, ఎస్ కె సలీం,చింతం. గంగారాం, బోయిడి సాయిలు, బి. పోశెట్టి, జె.శంకర్, పి. సాయిలు, భూమయ్య, వడ్ల గంగాధర్,ఎం. భూమయ్య తదితరులు పాల్గొన్నారు.