తె.యూ పాలకమండలి సభ్యులకు పి.డి.ఎస్‌.యు ఫిర్యాదు

నిజామాబాద్‌, నవంబర్‌ 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీలో టీచింగ్‌ పోస్టుల్లో అక్రమ నియామకాలను రద్దు చేయాలని మంగళవారం పాలక మండలి సభ్యులు మారయ్య గౌడ్‌, వసుంధరాదేవి, రవీందర్‌ రెడ్డి, ప్రవీణ్‌ కుమార్‌లను కలిసి పి.డి.ఎస్‌.యు నాయకులు వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా పి.డి.ఎస్‌.యు జిల్లా అధ్యక్షురాలు సిహెచ్‌ కల్పన మాట్లాడుతూ టీచింగ్‌, నాన్‌-టీచింగ్‌ అక్రమ నియామకాలను రద్దు చేస్తున్నట్టు గత పాలకమండలి సమావేశం ప్రకటించిందన్నారు. ఈ నేపథ్యంలోనే 2019 లో నిబంధనలకు విరుద్ధంగా నియామకమైన పార్ట్‌ టైమ్‌ టీచర్లను తొలగించారన్నారు.

కానీ సౌత్‌ క్యాంపస్‌ ఫిజిక్స్‌ విభాగంలో అక్రమ పద్ధతిలో ముగ్గురు పార్ట్‌ టైం లెక్చరర్లుగా నియామకమై, మళ్లీ తప్పుడు పద్ధతిలో ఎలాంటి నోటిఫికేషన్‌ లేకుండా ఫిజిక్స్‌ డిపార్ట్‌మెంట్‌కు సంబంధం లేకుండా, వారిని అకడమిక్‌ కన్సల్టెంట్లుగా మార్చారన్నారు. ఫిజిక్స్‌ డిపార్టుమెంటుకు సంబంధం లేకుండానే రెండున్నర సంవత్సరాలుగా వీరికి అకడమిక్‌ కన్సల్టెంట్స్‌గా వేతనాలు వస్తున్నాయన్నారు. ఇది యూనివర్సిటీ డబ్బును దుర్వినియోగం చేయడమే అవుతుందన్నారు.

ఈ అక్రమ నోటిఫికేషన్‌ను వెంటనే రద్దు చేయాలన్నారు. వీసీ, రిజిస్ట్రార్‌లు పాలకమండలిని, కమిషనర్‌ను తప్పుదోవ పట్టించడం మానుకోవాలన్నారు. ఈ విషయమై ఉన్నత విద్యా మండలికి ఫిర్యాదు చేస్తున్నామన్నారు. యూనివర్సిటీలో అకడమిక్‌ వాతావరణాన్ని పెంచేలా చర్యలు చేపట్టాలన్నారు. సానుకూలంగా స్పందించిన పాలకమండలి సభ్యులు త్వరలో జరగబోయే ఈసీ సమావేశంలో అక్రమ నోటిఫికేషన పై చర్చిస్తామన్నారు. తె.యూలో అక్రమాలకు తావు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పీ.డీ.ఎస్‌.యు రాష్ట్ర నాయకులు నరేందర్‌, నాయకులు అశుర్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »