డిచ్‌పల్లి, నవంబర్ 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఇప్పటివరకు కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న అకడమిక్ కన్సల్టెంట్‌గా ఉన్న పేరును అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా మార్చడంతో తమ సంతోషాన్ని ఉపకులపతితో పంచుకున్నారు. ఈ సందర్బంగా ఇటీవలే ప్రపంచస్థాయి రెండవ ర్యాంకింగ్ కేటగిరీలో తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి డా. డి. రవీందర్ గుప్తకి స్థానం లభించడం గర్వకారణమని, తెలంగాణ విశ్వవిద్యాలయము పేరు ప్రపంచ స్థాయిలో గుర్తింపు వస్తుందని అసిస్టెంట్ ప్రొఫెసర్లు తెలిపారు.
ఈ సందర్బంగా అసిస్టెంట్ ప్రొఫెసర్లందరూ కలసి ఉపకులపతిని ఘనంగా సన్మానించారు. రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరికి ధన్యవాదాలు తెలిపారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న వారి సమస్యలు అయిన పే స్లిప్, ఐడెంటిటీ కార్డు, విశ్వవిద్యాలయ మెయిల్ ఐడిలు వీటితోపాటు అడ్మినిస్ట్రేటివ్ పదవులతో పాటు మరికొన్ని సమస్యల పరిష్కారించాలని కోరడంతో ఉపకులపతి సానుకూలంగా స్పందించారు.
కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు దాతహరి, సరిత, అపర్ణ, రాజేశ్వరి, నాగేశవార్ రావు, శరత్, డేనియల్, నేత, సందీప్, శ్రీనివాస్, గంగాకిషన్, రాథోడ్, నాగేంద్రబాబు, సురేష్, స్వామి, జలందర్, పి.అర్.ఓ. డా. అబ్దుల్ ఖవి పాల్గొన్నారు.