డిచ్‌పల్లి, నవంబర్ 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని రెండు బాలుర వసతి గృహాలు, బాలికల వసతి గృహాలకు నూతనంగా చీఫ్ వార్డెన్‌గా బాధ్యతలు స్వీకరించిన డా. అబ్దుల్ ఖవి మొట్టమొదటిసారి బుధవారం వసతి గృహాలను తనిఖీ చేశారు.
ఇందులో భాగంగా విద్యార్థుల సమస్యలలో కొన్నింటికి అక్కడికక్కడే పరిష్కరించారు. మరికొన్ని సమస్యలను త్వరలో పరిష్కారం చేయడానికి కృషి చేస్తానని విద్యార్థులతో చీఫ్ వార్డెన్ డా. అబ్దుల్ ఖవి తెలిపారు.
వసతి గృహాలలోని పనిచేస్తున్న పనివారితో వారి సమస్యల గురించి చర్చించారు. వసతి గృహంలో భోజనం పరీక్షించి రుచి చూశారు. వంటవారికి తగు సూచనలు చేశారు. తనికీలో బాలికల వార్డెన్ డా. పార్వతి, తెయు ఇంజనీర్ బి.వినోద్, రహీం కేర్ టేకర్, తదితరులు ఉన్నారు.