కామారెడ్డి, నవంబర్ 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం రాష్ట్ర పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ కన్వీనర్ మహ్మద్ అలీ షబ్బీర్ ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లాలోని అన్ని మండల కేంద్రాలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించి, మెమోరండం సమర్పించారు.
కామారెడ్డి పట్టణంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కైలాస శ్రీనివాసరావు నాయకత్వంలో కామారెడ్డి మండల కాంగ్రెస్ అధ్యక్షులు గూడెం శ్రీనివాస్ రెడ్డి, కామారెడ్డి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పండ్ల రాజు ఆధ్వర్యంలో రైతులు కష్టపడి, ఆర్థిక పెట్టుబడి పెట్టి, పంట పండిరచుకుని ప్రభుత్వాలు కొనుగోలు చేయాలని కల్లాలోనే మొన్నటి వర్షానికి వడ్లు తడిచి మొలకలు ఎత్తిన వడ్లను ప్రభుత్వాలు కొనుగోలు చేయాలని అన్నారు.
అలాగే డబ్బులు కూడా వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం స్థానిక ఎమ్మార్వో కార్యాలయంలో మెమోరాండం సమర్పించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ పాత శివ కృష్ణమూర్తి, మాజీ కౌన్సిలర్లు బట్టు మోహన్, గోనే శ్రీనివాస్, మాజీ ఎంపిటిసి నిమ్మ విజయ్ కుమార్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ కోఆర్డినేటర్ లక్క పతిని గంగాధర్, సొసైటీ డైరెక్టర్ రమేష్, యువజన కాంగ్రెస్ నాయకుడు హనుమండ్లరవి, తదితరులు పాల్గొన్నారు.