నిజామాబాద్, నవంబర్ 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వేల్పూర్ నుండి మోతే వెళ్లే రహాదారిలో మంగళవారం అర్ధరాత్రి 12:30 గంటల ప్రాంతంలో ఒక కారు అతివేగంగా వెళ్లి చెట్టును ఢీకొనడంతో అందులో గల ముగ్గురిలో ఇద్దరూ సంఘటన స్థలంలో మరణించారు. అట్టి సంఘటన స్థలాన్ని బుధవారం నిజామాబాద్ పోలీస్ కమీషనర్ కార్తీకేయ సందర్శించారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరుగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గూర్చి సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. అనంతరం సిరికొండ పోలీస్ స్టేషన్ సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పనితీరును, రిసిప్షన్ సెంటర్ పనితీరును, కంప్యూటర్ సిబ్బంది పనితీరును క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవల్సిన జాగ్రత్తలు తెలిపారు. సంవత్సరకాలంలో 25 ప్రమాదాలు జరుగగా అందులో 8 మంది మరణించగా, 17 మంది క్షతగాత్రులు కావడం జరిగిందని, ప్రధానంగా ఎక్కువ ప్రమాదాలు ద్విచక్ర వాహనాదారులకు జరుగుతున్నందున, తప్పనిసరి హెల్మేట్ ధరించి ప్రయాణం చేయాలని, గంజాయి నిర్మూలనకు అధికారులకు ఆదేశాలు జారీచేయడం జరిగిందని, ఎవరైన గంజాయికి బానిస అవుతే వారికి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుందని, దాని నిర్మూలనకు పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు.
ఈ సందర్భంగా డిప్యూటి కమీషనర్ ఆఫ్ పోలీస్ వి. అరవింద్ బాబు, ఆర్మూర్, నిజామాబాద్, ట్రాఫిక్ ఎ.సి.పిలు రఘు, ఎ. వెంకటేశ్వర్, ప్రభాకర్ రావ్, సి.ఐలు విజయ్ కుమార్, వేల్పూర్, సిరికొండ ఎస్.ఐలు రాజ్ భరత్, నరేష్‌లు పాల్గొన్నారు.