డిచ్‌పల్లి, నవంబర్ 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీ అర్థ శాస్త్ర విభాగంలో సాగు చట్టాలు 2020 రద్దు అంశంపై జరిగిన ప్యానల్ డిస్కషన్సెకు ముఖ్య అతిథిగా హాజరైన విశ్వవిద్యాలయ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నాగరాజు సాగు చట్టాలు ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం స్వాగతించవలసిందే అన్నారు.
విభాగ అధిపతి డాక్టర్ టి సంపత్ అధ్యక్షతన జరిగిన చర్చా కార్యక్రమంలో డాక్టర్ పాత నాగరాజు మూడు చట్టాలను సమీక్షించారు. చట్టాల వల్ల రైతులకు లాభనష్టాలను వివరించారు. డాక్టర్ పున్నయ్య పాఠ్యప్రణాళిక అధ్యక్షులు వ్యవసాయ చట్టాలు రైతులకు ఏ విధంగా నష్టము కలిగిస్తుందో వివరించారు.
రైతుల ఉద్యమాలు పాలకులను ఏవిధంగా వెనక్కి తీసుకున్నట్లు చేసిందో వివరించారు. డాక్టర్ వెంకటేశ్వర్లు రైతు చట్టాల ప్రభావాన్ని తెలిపారు. ప్యానల్ డిస్కషన్‌లో డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ దత్త హరి, డాక్టర్ బాల శ్రీనివాసమూర్తి, విద్యార్థులు పాల్గొన్నారు.