డిచ్‌పల్లి, నవంబర్ 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎస్‌బిఐ అందిస్తున్న శిక్షణ ద్వారా స్వయం ఉపాధికి భరోసా లభిస్తుందని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. ఎస్‌బిఐ ఆధ్వర్యంలో ఆర్‌ఎస్‌ఇటిఐ ద్వారా స్వయం ఉపాధికి శిక్షణ పొందిన అభ్యర్థులకు ధ్రువీకరణ పత్రాలు అందించారు. గురువారం డిచ్‌పల్లిలోని స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో, టిటిడిసిని ఆయన సందర్శించారు.
ఆర్‌ఎస్‌ఇటిఐ ఆధ్వర్యంలో సిసిటివి శిక్షణ ముగించుకున్న ట్రైనీస్‌కి ఈ సందర్భంగా సర్టిఫికెట్లు, టూల్ కిట్స్ పంపిణీ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ శిక్షణను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని శిక్షణ ద్వారా జీవితంలో స్వయం ఉపాధి పొంది తమ కుటుంబాలకు భరోసాగా నిలవాలని సూచించారు.
ఎస్‌బిఐ ఆర్‌ఎస్‌ఇటిఐ ద్వారా చాలా చక్కని శిక్షణ అందిస్తున్నారని వీటి ద్వారా గ్రామీణ ప్రాంత యువతీ, యువకులు మంచి పరిజ్ఞానాన్ని పొంది జీవితంలో స్థిరపడాలని కోరారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ సుధీంద్ర బాబు, ఆఫీస్ సిబ్బంది రామకృష్ణ, భాగ్యలక్మి, నవీన్, రంజిత్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.