నిజామాబాద్, నవంబర్ 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాదు జిల్లాలో ఇటీవల నిర్వహించిన మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియలో నిలిచిన నిజామాబాదు పట్టణంలోని గెజిట్ షాప్ నెంబర్. నిజామాబాద్ 008, ఎడపల్లి మండలంలోని జానకంపేట గెజిట్ షాప్ నెంబర్. నిజామాబాద్ 0036, వేల్పూర్ మండలంలోని పడగల్ గెజిట్ షాప్ నెంబర్. నిజామాబాద్ 099 దుకాణాల కేటాయింపునకు గాను దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి ఎస్. నవీన్ చంద్ర ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ నెల 26వ తేదీ నుండి 28వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు జిల్లా ఎక్సైజ్ కార్యాలయం నందు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని, ఈనెల 29వ తేదీన ఉదయం 11 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు లక్కీ డ్రా పద్ధతిన ఎంపిక చేయడం జరుగుతుందని, ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.