డిచ్‌పల్లి, నవంబర్ 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనుల ప్రణాళిక 2022-23 సంవత్సరానికి గాను జిల్లాలోని మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు, మండల పంచాయతి అధికారులకు, ఆదనపు కార్యక్రమ అధికారులకు (ఏపివో), ఇంజనీరింగ్ కన్సల్టెంట్లకు, సాంకేతిక సహయకులకు ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని డిచ్‌పల్లి టిటిడిసిలో నిర్వహించారు.
ప్రణాళిక తయారిలో బాగంగా లేబర్ బడ్జెట్‌కు అనుగుణంగా పనులను గుర్తించాలని పనుల ఎంపిక గ్రామాలకు ఉపయోగపడేలా నీటి సంరక్షణ పనులు, భూగర్భ జలాలను పెంపొందించే పనులు గుర్తించాలని కలెక్టరు సూచించారు. చేపట్టిన ప్రతీ పనిలో పారదర్శకత పాటించి నాణ్యమైన పనులను చేపట్టాలన్నారు. ప్రతి గ్రామంలో ప్రణాళిక బద్దంగా సంవత్సరం పొడవున పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.