కామారెడ్డి, నవంబర్ 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మండలం దేవునిపల్లి, లింగాపూర్, ఇస్రోజివాడి గ్రామాల్లో గురువారం రాష్ట్ర ఎన్నికల రోల్ పరిశీలకుడు టి. విజయ్ కుమార్ సందర్శించారు. ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమం ద్వారా ఎంతమంది కొత్త ఓటర్లను చేర్చరని వివరాలు బూత్ లెవెల్ పోలింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
లింగాపూర్‌లో మొత్తం ఓటర్ల సంఖ్య ఎంత అని వివరాలు తెలుసుకున్నారు. తొమ్మిది వందల యాభై మంది ఓటర్లు ఉన్నారని, ఇంటింటికి తిరిగి కొత్త ఓటర్లను 19 మందిని చేర్చినట్లు తెలిపారు. మృతిచెందిన వారి పేర్లు తొలగించారా అని వివరాలు సేకరించారు. దేవునిపల్లిలో శ్రీకాంత్ అనే యువకుడి ఫోటో పాతది ఉంటే దాని స్థానంలో కొత్త ఫోటో సవరణ చేసినట్లు తెలిపారు. ఇస్రోజివాడిలో కొత్తగా నమోదు చేసుకున్న ఓటర్ రాజుతో మాట్లాడారు.
2022 జనవరి1 నాటికి 18 ఏళ్లు నిండిన యువకుల పేర్లు ఓటరు జాబితాలో నమోదు చేయాలని బూత్ లెవల్ అధికారులను ఆదేశించారు. గరుడ యాప్ ద్వారా కొత్త ఓటర్లను నమోదు చేయాలని సూచించారు. ఇస్రోజివాడిలో మొత్తం 810 మంది ఓటర్లు ఉన్నారని బూత్ లెవల్ అధికారులు పేర్కొన్నారు. అంతకుముందు జిల్లా సమీకృత కార్యాలయానికి వచ్చిన ఎన్నికల రోల్ పరిశీలకుడు విజయ్ కుమార్‌కు పూల మొక్కలు ఇచ్చి స్వాగతం పలికారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఇంచార్జ్ జిల్లా అదనపు కలెక్టర్ వెంకట మాధవరావు, జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడి దయానంద్, జిల్లా ఎస్సీ వసతి గృహల సంక్షేమ అధికారి రజిత, ఆర్డీవో శీను, తహసిల్దార్ ప్రేమ్ కుమార్, సూపరింటెండెంట్ సాయి భుజంగరావు, అధికారులు పాల్గొన్నారు.