నిజామాబాద్, నవంబర్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని నెహ్రూ యువ కేంద్ర నిజామాబాద్ ఆధ్వర్యంలో నగరంలోని విశ్వశాంతి డిగ్రీ కళాశాలలో రాజ్యాంగం పైన అవగాహన సదస్సు, రాజ్యాంగ అంశాల పైన క్విజ్ పోటీ నిర్వహించారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ వేదశ్రీ మాట్లాడుతూ విద్యార్థులు రాజ్యాంగ హక్కులు, విధుల పట్ల సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని, తద్వారా భవిష్యత్ తరాలకు రాజ్యాంగ విలువలను అందించగలమని సూచించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్ మాట్లాడుతూ మన రాజ్యాంగం మన అందరికి ఎంతో గౌరవించదగినదని, అనుసరించదగినదని రాజ్యాంగ స్పూర్తితో మనం మన నిత్య జీవితంలో విశేషమైన మార్పులు తీసుకురావచ్చని సూచించారు.
కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ రాజ్యాంగ పీఠికను ప్రతిజ్ఞగా స్వీకరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన క్విజ్ పోటీల్లో విజేతలుగా నిలిచిన యువతీ యువకులకు బహుమతులు, పాల్గొన్నవారందరికి ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో రేష్మ చంద్రన్, శ్రీలత, లత, విశ్వశాంతి విద్యాసంస్థల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.