గాంధారి, నవంబర్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ ప్రభుత్వం రైతులు పండిరచిన వడ్లతో రాజకీయం చేస్తూ పబ్బం గడుపుకుంటుందని టీజెఎస్ రాష్ట్ర కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. తెలంగాణ జన సమితి ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన రైతు రక్షణ యాత్రలో భాగంగా శుక్రవారం గాంధారి మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు.
ఈ సందర్బంగా అక్కడ నిల్వ ఉన్న వరి కుప్పలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. రైతు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాలలో సరైన సౌకర్యాలు లేవని రైతులు ఆయనకు తెలిపారు. అంతేకాకుండ వరి కొనుగోలు తొందరగా జరగడం లేదని తెలిపారు. రైతుల వద్ద నుండి తెలంగాణ ప్రభుత్వం వడ్లను కొనుగోలు చేయడంలో తీవ్ర జాప్యాన్ని తెలుసుకున్నారు.
అనంతరం కోదండరాం మాట్లాడుతూ ఖరీఫ్‌లో రైతులు పండిరచిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఎక్కడికక్కడ వరి కుప్పలు దర్శనమిస్తున్నాయని అన్నారు. అంతేకాకుండా రోడ్లపై కూడా రైతులు ధాన్యాన్ని ఎండపోసుకోను ప్రభుత్వం ఎప్పుడు కొంటుందా అని ఎదురుచూస్తున్నారని అన్నారు. అయినా కూడా ప్రభుత్వంలో చలనం లేదని, రైతుల ఆవేదనను ప్రభుత్వం పెడచెవినా పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం వెంటనే రైతుల వద్ద కల పూర్తి వడ్ల ధాన్యాన్ని కొనుగోలు చేయాలనీ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ రైతులను రాజకీయంగా వాడుకుంటున్నారని, ఇకనైనా రైతుల సమస్యలు పరిష్కారించక పొతే రైతులే తగిన బుద్ది చెబుతారని అన్నారు. రైతుల వద్ద నుండి ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేసేవరకు తెలంగాణ జన సమితి పోరాటం చేస్తుందని అన్నారు.
యాసంగిలో రైతులు ఏ పంట వేయాలో కూడా ప్రభుత్వం తొందరగా స్పష్టం చేయాలనీ డిమాండ్ చేశారు. ఒకవేళ అలా తెలుపని యెడల యాసంగిలో రైతులు ఏ పంట వేసిన ప్రభుత్వమే కొనుగోలు చేయాలనీ అన్నారు. రైతుల పక్షాన పోరాడుతానని చెప్పిన కెసిఆర్ ఢల్లీికి వెళ్లి ఏం సాధించారో తెలంగాణ ప్రజలకు తెలుపాలని డిమాండ్ చేశారు.
నాలుగు రోజులు ఢల్లీిలో కేవలం పడుకోవడానికి వెళ్లినట్టు ఉందని అన్నారు. దేశానికి వ్యవసాయ రంగమే కీలకమని, రైతులను కష్టపెట్టిన ఏ ప్రభుత్వం బాగుపడలేదని అన్నారు. రైతుల వద్ద ఉన్న ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేసే వరకు ఆందోళన చేస్తామని కోదండరాం స్పష్టం చేశారు. ఆయన వెంట టీజెఎస్ ఎల్లారెడ్డి నియోజకవర్గం ఇంచార్జి నిజ్జన రమేష్, కాంగ్రెస్ ఎంపీటీసీలు నాయకులు తూర్పు రాజు, బాలరాజ్, రవి, తదితరులు ఉన్నారు.