నిజామాబాద్, నవంబర్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ, ప్రయివేటు ఐటిఐ విద్యార్థుల అడ్మిషన్ కొరకు 4వ ఫేస్‌కు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవడానికి మరో అవకాశం కల్పించడానికి ఈనెల 30 వ తేదీ వరకు పొడిగించినట్టు ప్రభుత్వ ఐటిఐ ప్రిన్సిపాల్, జిల్లా కన్వీనర్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఇంతకుముందు దరఖాస్తు చేసుకున్న వారికి, కొత్తగా దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మెరిట్ ప్రాతిపదికన సీటు పొందగలరని జిల్లా కన్వీనర్ కోటిరెడ్డి తెలిపారు.