వేల్పూర్, నవంబర్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలంలోని పడగల గ్రామంలో వరి ధాన్యాన్ని బాల్కొండ బిజెపి పార్టీ నియోజకవర్గం ఇంచార్జ్ రాజేశ్వర్తో, మండల స్థాయి నాయకులతో కలసి పరిశీలించారు.
ఈ సందర్బంగా రాజేశ్వర్ మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలు విషయంపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కాదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యమని హుజురాబాద్ ఎన్నికల్లో తెలంగాణ పార్టీ ఎమ్మెల్యే ఓడిపోవడం పట్ల సీఎం కెసిఆర్ తమ ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారని రైతులకు ఇచ్చిన హామీని పూర్తిస్థాయిలో వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.